పూరి పాడ్ కాస్ట్ ల పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Aug 13, 2020 1:06 am IST

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవల పాడ్ కాస్ట్ లతో అభిమానులను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. అయితే ఇందులో కొందరు సెలబ్రిటీ లు కూడా ఉన్నారు. అయితే తాజాగా స్త్రీ పై చేసిన పాడ్ కాస్ట్ పై అభిమానులు ఎక్కువ మంది స్పందిస్తున్నారు. అద్బుతం అంటూ కొనియాడుతున్నారు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పూరి అభిమానుల్లో చేరి పోయారు. పూరి గారు పాడ్ కాస్ట్స్ అద్బుతం అని తెలిపారు. చాలా బావున్నాయి అని, వ్యక్తిగతంగా నాకు చాలా బాగా నచ్చాయి అని, నా హృదయ పూర్వక ప్రేమ మీకోసం అంటూ తెలిపారు.

అంతేకాక పూరి జగన్నాథ్ గారు ఇలాంటి అందమైన టాపిక్స్ ఇంకా చేయాలి అని అన్నారు. ఇందుకు పూర్తి జగన్నాద్ స్పందిస్తూ, నేను మీ ట్వీట్ ను చదువుతూ చాలా ఆనందించాను. మీలాంటి విజయవంతమైన యువకుడు నుండి ఇది పెద్ద అభినందన అని, ఈ రాత్రి మరొక పెగ్ అదనంగా వేస్తా లవ్ యూ అని ముగించారు.

సంబంధిత సమాచారం :

More