“కల్కి 2898 AD” రిలీజ్ ట్రైలర్ ను మూడు సార్లు చూసా – సందీప్ రెడ్డి వంగా

“కల్కి 2898 AD” రిలీజ్ ట్రైలర్ ను మూడు సార్లు చూసా – సందీప్ రెడ్డి వంగా

Published on Jun 22, 2024 12:30 AM IST

పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీ కల్కి 2898AD. ఈ చిత్రం జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానుంది. ఈ చిత్రం ను ప్రాజెక్ట్ కె గా అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై అందరిలో ఆసక్తి నెలకొంది. సినిమా తొలి ఈవెంట్ తోనే వరల్డ్ దృష్టి ను ఆకర్షించే విధంగా ప్లాన్ చేసాడు. తాజాగా రిలీజ్ ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ తో సినిమా పై మరింత అంచనాలు పెరిగాయి.

ఈ రిలీజ్ ట్రైలర్ ను చూసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. సూపర్ ట్రైలర్, మూడు సార్లు చూసాను. ఇది కచ్చితంగా డిఫెరెంట్ వరల్డ్ మరియు కొత్త ఎక్స్ పీరియన్స్. ఫస్ట్ డే ఫస్ట్ షో పక్కా అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో దీపికా పదుకునే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు