రామ్ చరణ్ దగ్గర కంట్రోల్డ్ పవర్ ఉంటుంది – డైరెక్టర్ శంకర్

రామ్ చరణ్ దగ్గర కంట్రోల్డ్ పవర్ ఉంటుంది – డైరెక్టర్ శంకర్

Published on Jul 8, 2024 12:00 AM IST

సెన్సేషనల్ కాంబినేషన్ అయిన కమల్ హాసన్ మరియు శంకర్ ల తాజా చిత్రం భారతీయుడు 2, జూలై 12 వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంకు కి సంబందించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది. అందులో భాగంగానే నేడు తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది. ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. డైరెక్టర్ శంకర్ ఈ ఈవెంట్ లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మాకు సపోర్ట్ చేస్తున్న తెలుగు ఆడియెన్స్ కోసం స్ట్రెయిట్ పిక్చర్ చేయాలని అనిపించింది, గేమ్ చేంజర్ ద్వారా ఆ అవకాశం దొరికింది అని అన్నారు. రామ్ చరణ్ పోర్షన్ కంప్లీట్ అయ్యింది, ఆయన గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన దగ్గర ఒక కంట్రోల్డ్ పవర్ ఉంటుంది. ఇది ఎప్పుడు బ్లాస్ట్ అవుతదా అనే మంచి యాక్టర్. సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. రామ్ చరణ్ తో వర్క్ చేసినందుకు చాలా సంతోషం గా ఉంది. ఇంకా 10-15 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. తర్వాత రిలీజ్ కి రెడీ చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శంకర్ చేసిన కామెంట్స్ తో సినిమా పై అందరిలో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు