ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మూలాన ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూస్తూనే ఉన్నాము. మరి ఈ క్రమంలోనే తమిళ నాట పెరుగుతున్న కోవిడ్ ప్రభావం నిమిత్తం అనేకమంది సినీ తారలు తమిళనాడు ప్రభుత్వ నిధికి భారీ మొత్తంలో విరాళాలు అందించారు.
ఈ మధ్యనే దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్, హీరో సూర్య, కార్తీ, థలా అజిత్ అలాగే మరింత మంది ఆర్ధిక సాయం అందించారు. మరి ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ 10 లక్షల రూపాయలను ట్రాన్స్ఫర్ చేశారట. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం శంకర్ విశ్వ నటుడు కమల్ హాసన్ తో “ఇండియన్ 2” చిత్రం చెయ్యాల్సి ఉంది. దాని తర్వాత మరో బిగ్గెస్ట్ అండ్ బెంచ్ మార్క్ కాంబో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చెయ్యనున్నారు.