“పొన్నియిన్ సెల్వన్” డైరెక్టర్ శంకర్ ఇంట్రెస్టింగ్ రివ్యూ.!

Published on Oct 5, 2022 5:29 pm IST

తమిళ సినిమా నుంచి ఎన్నో అంచనాలు నెలకొల్పుకొని ఎపుడు నుంచో మంచి మోస్ట్ అవైటెడ్ గా వచ్చిన భారీ పాన్ ఇండియా చిత్రం “పొన్నియిన్ సెల్వన్ 1”. దర్శకుడు మణిరత్నం నుంచి డ్రీం ప్రాజెక్ట్ గా ఈ చిత్రం వచ్చింది. అయితే మిక్సిడ్ టాక్ తోనే వచ్చినా తెలుగు సహా వరల్డ్ వైడ్ కూడా భారీ ఓపెనింగ్స్ అందుకొని స్టాండర్డ్ వసూళ్లతో ఆశ్చర్యపరిచింది.

ముఖ్యంగా తమిళ ప్రైడ్ చిత్రంగా ఇది రావడంతో వారికి ఎంతో దగ్గరైంది ఈ చిత్రం. ఇక ఈ చిత్రంపై అయితే లేటెస్ట్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ అయితే చేసారు. చాలా ఏళ్ల తర్వాత తమిళ హిస్టారికల్ సినిమాగా అత్యున్నత ప్రమాణాలతో వచ్చింది అని మణిరత్నం గారి ఫిల్మ్ మే’కింగ్’ ఏంటో మళ్ళీ ప్రూవ్ అయ్యింది.

రవి వర్మన్ సినిమాటోగ్రఫీ కి హ్యాట్సాఫ్, రెహమాన్ మ్యూజిక్ చాలా వచ్చింది. సినిమా కోసం పని చేసిన మొత్తం ఆర్మీ కి హ్యాట్సాఫ్ చెప్తున్నానని శంకర్ తన రివ్యూ తెలిపారు. దీనితో తమిళ్ ఆడియెన్స్ అయితే మళ్ళీ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ప్రస్తుతం అయితే శంకర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో తమ కాంబోలో 15వ సినిమా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :