నాచురల్ స్టార్ నానితో సూపర్ హిట్ మూవీ దసరా చిత్రాన్ని అందించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. తన డెబ్యూ చిత్రంతోనే సాలిడ్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు సరిపోదా శనివారం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సరిపోదా శనివారం దర్శకుడు వివేక్ ఆత్రేయ అంటే చాలా ఇష్టమని, అతని చిత్రాలు మనతో మాట్లాడతాయి అని అన్నాడు.
నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను. నేను ఇంటర్ పాస్ అయితే, బీ టెక్ చేయిద్దాం అని మా నాన్న అనుకున్నాడు. అందుకే ఒక సబ్జెక్టు ఆపాను. ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ కావాలంటే, ఇంటర్ పాస్ కావాలని తెలిసి, పాస్ అయ్యి, జాయిన్ అయ్యాను. అక్కడ కూడా ఫెయిల్ కావడంతో, బీ టెక్ చేయించాలి అని మా నాన్న, బాబాయ్ పట్టుబట్టారు. నా దగ్గర సర్టిఫికెట్ ఉంది కాబట్టే ఇలా అంటున్నారు అని, కోపం వచ్చి ఇంటర్, 10th, 7th క్లాస్ సర్టిఫికెట్లు తగలబెట్టాను. అయితే వివేక్ ఆత్రేయ తీసిన బ్రోచేవరెవరురా సినిమాలో ఇలాంటి సీన్ ఉంటుంది. వీడేవడురా బాబు, సేమ్ నా సీన్ రాసిండు అనుకున్నా అంటూ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.