“పుష్ప” కోసం సుకుమార్ కొత్త ప్లానింగ్.!?

Published on Jun 30, 2020 10:57 pm IST


ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “పుష్ప”. ఈ సినిమాతో మొట్టమొదటి సారిగా అల్లు అర్జున్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నారు. మొత్తం 5 భాషల్లో భారీ ఎత్తున ప్లాన్ చేయాలనుకున్న ఈ చిత్రం షూట్ కు కరోనా అడ్డు పడింది. దీనితో దర్శకుడు సుకుమార్ తన ముందు ప్లానింగ్ లలో చాలానే మార్పులు చెయ్యాల్సి వచ్చింది. అలా ఈ భారీ ప్రాజెక్ట్ ఒక పర్ఫెక్ట్ మేకిన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది.

ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ కోసం దర్శకుడు సుకుమార్ ప్లాన్స్ మార్చినట్టు తెలుస్తుంది. ఇంతకు ముందు కర్ణాటక అడవుల్లో షూట్ చెయ్యాలని భావించిన సుక్కు ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆ ప్లాన్ ను మార్చాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు తెలంగాణలోని కొన్ని కీలక అడవి ప్రాంతాలను ఎంచుకుంటున్నారట. అక్కడ ఈ చిత్రంకు సంబంధించిన కొన్ని కీలక సన్నవేశాలను తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. ఈ భారీ ప్రాజెక్ట్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More