కూలీల జీవితాన్ని చూపించే ‘వలస’ !

సొంతవూరు, గంగపుత్రులు , గల్ఫ్ లాంటి సామాజిక ఇతివృత్తాలతో సినిమాలు చేసే సునీల్ కుమార్ రెడ్డి తాజాగా మరో సామజిక అంశాన్ని కథావస్తువుగా ‘వలస’ పేరుతో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై యక్కలి రవీంద్రబాబు నిర్మాతగా ఈ చిత్రం రూపు దిద్దుకుంటుంది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం వలన రోడ్డున పడ్డ కోట్లాది వలస కూలీల జీవితాన్ని చూపించే ఒక ప్రయత్నం’ వలస ‘.

రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథ లాంటి చిత్రాలతో యూత్ కి బాగా దగ్గరైన మనోజ్ నందం , వినయ్ మహాదేవ్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో తేజు, గౌరీ లు వారి సరసన హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు.తనీషా , తులసి రామ్ , మనీషా, ఎఫ్ ఎం బాబాయ్ , సముద్రం వెంకటేష్ , నల్ల శీను , మల్లికా , చిన్నారి, సాజిద్ , రామన్ , వాసు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రవీణ్ ఇమ్మడి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నరేష్ కుమార్ మడికి కెమెరా మరియు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కలరింగ్ శ్యాం కుమార్ పి ,ఆడియోగ్రఫీ ప్రదీప్. నిర్మాత యక్కలి రవీంద్రబాబు. కధ మాటలు , పాటలు , స్క్రీన్ ప్లే , దర్శకత్వం పి. సునీల్ కుమార్ రెడ్డి. చిత్రికరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉంది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.

Exit mobile version