ఇంటర్వ్యూ : టి.సంతోష్ – ‘అర్జున్ సురవరం’ను బాగా ఆదరిస్తున్నందుకు చాల థాంక్స్ !

ఇంటర్వ్యూ : టి.సంతోష్ – ‘అర్జున్ సురవరం’ను బాగా ఆదరిస్తున్నందుకు చాల థాంక్స్ !

Published on Dec 1, 2019 3:39 PM IST

నిఖిల్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా టి.సంతోష్ దర్శకత్వం వహించిన సినిమా ‘అర్జున్ సురవరం’. ఈ సినిమాను బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు. కాగా ఈ చిత్రం విడుదలై మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సంధర్భంగా దర్శకుడు టి.సంతోష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం.

 

మీ సినిమాకి ఆదరణ ఎలా ఉంది ?

ఆదరణ చాల బాగుంది. ముందుగా మా సినిమాని ఆదరించిన ప్రేక్షుకులకు అలాగే మంచి రివ్యూస్ ఇచ్చిన క్రిటిక్స్ కు, మరియు సినిమాని జనంలోకి తీసుకెళ్లినందుకు మీడియాకు చాల థాంక్స్.

 

తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగు సినిమా తీశారు. మరి తెలుగు నేర్చుకోలేదా ?

తెలుగు అర్ధం అవుతుంది. నిజంగా తెలుగు మంచి బ్యూటిఫుల్ లాంగ్వేజ్. కొంచెం కొంచెం మాట్లాడతాను. తెలుగు పీపుల్ వెరీ లవబుల్ పీపుల్. తరువాత సినిమాకి తెలుగు ఖచ్చితంగా పూర్తిగా నేర్చుకుంటాను.

 

ఈ సినిమాని నిఖిల్ తోనే చేయడానికి కారణం ?

మా నిర్మాత భానుగారు నిఖిల్ ను అప్రోచ్ అయ్యారు. అప్పటికీ నిఖిల్ గురించి నేను విన్నాను గాని, తన సినిమాలేవీ చూడలేదు. అప్పుడే తన సినిమాలు చూసి.. తన లుక్ మార్చాలని అనుకున్నాము. ఈ సినిమా కోసం తను అద్భుతమైన ఎఫెక్ట్స్ పెట్టాడు. తను కెమెరా ముందే కాదు, వెనుక కూడా వెరీ యాక్టివ్.

 

తమిళ్ సినిమాకు తెలుగు సినిమాకు మధ్య తేడా ఏమిటి ?

తెలుగులో మంచి ఫన్ అండ్ ఎమోషన్ ఉన్న సినిమాలను ఇక్కడ బాగా ఆదరిస్తారు. తమిళ్ లో వేరేరకమైన సినిమాలను లైక్ చేస్తారు.

 

అర్జున్ సురవరం స్క్రిప్ట్ రాయడానికి ప్రేరణ ఏమిటి ?

నాకు పర్సనల్ గా మీడియా అంటే బాగా ఫ్యాషన్. ఒకవేళ నేను డైరెక్టర్ ని కాకపోయి ఉండిఉంటే.. ఖచ్చితంగా రిపోక్టర్ ను అయి ఉండేవాన్ని. ఆ ఆసక్తితోనే ఈ స్క్రిప్ట్ రాసుకున్నాను.

 

ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడినప్పుడు బాధ కలిగిందా ?

కొన్ని సమస్యలు ప్రతి ఫీల్డ్ లోనూ ఉంటాయి. అలాగే సినిమా ఇండస్ట్రీలోనూ ఉంటాయి. అయితే ఏడు ఎనిమిది నెలలు సినిమా పోస్ట్ ఫోన్ అయినప్పుడు కొంత బాధ కలిగించింది.

 

తమిళంలో ఈ సినిమాకి ఆదరణ ఎలా ఉంది ?

అక్కడ కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఒక అప్ కమింగ్ హీరో సినిమాకు తమిళంలో హౌస్ ఫుల్ అనేది రేర్ గా జరుగుతుంది. అది మా సినిమాకు జరగడంతో చాల సంతోషంగా ఉన్నాము.

 

మీ తదుపరి సినిమా తెలుగులోనే ఉంటుందా ?

ఇంకా ఏది డిసైడ్ అవ్వలేదు. తెలుగు – తమిళం రెండు లాంగ్వేజ్ ల్లో చేస్తే ఇంకా హ్యాపీ కదా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు