హీరోలుగా దర్శకుడు వారసులు

టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు సముద్ర వారసులు అరుణ్ మహాశివ, రామ్ త్రివిక్రమ్ హీరోలుగా “దో కమీనే” సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. “షోలే”, “ఆర్ఆర్ఆర్” కలిపితే ఎలా ఉంటుందో అలాంటి స్క్రిప్ట్ తో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రాన్ని హారిక సమర్పణలో చందు క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ చంద్ర పులుగుజ్జు నిర్మిస్తున్నారు. సముద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తస్మయి, శ్రీ రాధ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో యాక్టర్స్ శ్రీకాంత్, సుమన్, దర్శకులు బి గోపాల్, ఎఎస్ రవికుమార్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి సుమన్ క్లాప్ నివ్వగా బి.గోపాల్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు, హీరో శ్రీకాంత్ స్క్రిప్ట్ అందించారు, నందమూరి మోహనకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ వి సముద్ర మాట్లాడుతూ – పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా దో కమీనే సినిమాను రూపొందిస్తున్నాం. ఈ రోజు మా మూవీ ప్రారంభోత్సవానికి ఎంతోమంది మిత్రులు, పెద్దలు వచ్చి ఆశీర్వదించారు. వారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. నా మిత్రుడు చంద్ర ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. నవంబర్ 3వ వారం నుంచి దో కమీనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మా మూవీ రిలీజ్ అయ్యాక దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుందనే నమ్మకం ఉంది. అన్నారు.

నిర్మాత చంద్ర పులుగుజ్జు మాట్లాడుతూ – అందరికీ దసరా శుభాకాంక్షలు. మా చంద్ర క్రియేషన్స్ బ్యానర్ లో దో కమీనే సినిమాను ఘనంగా లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. సముద్ర గారి దర్శకత్వంలో ఒక మంచి మూవీతో మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుతున్నాం. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని మంచి చిత్రాలు మా సంస్థ నుంచి వస్తాయి. అన్నారు.

హీరో రామ్ త్రివిక్రమ్ మాట్లాడుతూ – నాన్న సముద్ర గారి దర్శకత్వంలో నటించాలనేది నా డ్రీమ్. ఆ కల ఇంత త్వరగా నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. అందుకు మా ప్రొడ్యూసర్ చంద్రగారికి థ్యాంక్స్ చెబుతున్నాం. త్వరలోనే ఒక మంచి చిత్రంతో మీ ముందుకు వస్తాం. అన్నారు.

హీరో అరుణ్ మహాశివ మాట్లాడుతూ – హీరోగా నేను ఇండస్ట్రీకి రాగలనా అని అనుకునేవాడిని. చంద్ర గారి ప్రొడక్షన్ తో దో కమీనే సినిమా చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. చంద్ర గారితో పాటు నాన్న సముద్ర గారికి థ్యాంక్స్ చెబుతున్నా. మంచి టీమ్ మా మూవీకి కుదిరింది. ప్రేక్షకులకు అన్ని ఎలిమెంట్స్ అందించే సినిమా అవుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

Exit mobile version