“విశ్వంభర” టీజర్ గురువారం రిలీజ్ చెయ్యట్లేదు – దర్శకుడు వశిష్ఠ

“విశ్వంభర” టీజర్ గురువారం రిలీజ్ చెయ్యట్లేదు – దర్శకుడు వశిష్ఠ

Published on Aug 21, 2024 11:58 PM IST

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విశ్వంభర చిత్రం నుండి టీజర్ రిలీజ్ అవుతుంది అని అంతా ఆశించారు. అందుకు భిన్నంగా దర్శకుడు వశిష్ఠ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిన్నప్పటి నుండి చిరుపై ఎంతో అభిమానం ఉందని వెల్లడించిన వశిష్ఠ, ఆయన మ్యానరిజం ను బాగా అనుకరించే వాడిని అని అన్నాడు. మెగా అభిమానులు కోరుకునే అంశాలు అన్ని ఈ విశ్వంభర లో ఉంటాయి అని అన్నారు. తను కూడా మెగాస్టార్ కి అభిమాని అని వెల్లడించారు.

ఈ చిత్రంలో వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి ను చూస్తారు అని, సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అని అన్నాడు. టీజర్ విడుదల గురించి ప్రస్తావిస్తూ, టీజర్ పై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు ఓ రకంగా సినిమా ప్రమోషన్ కి మంచిదే అని పేర్కొన్నాడు. ఒక ప్లాన్ ప్రకారం సినిమా ప్రచారం చేయాలని భావిస్తున్నట్లు తెలిపాడు. అంతేకాక టీజర్ ను బర్త్ డే కి రిలీజ్ చేయడం లేదు అని, త్వరలో రిలీజ్ చేస్తాం అని తెలిపాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు