గ్రాండ్ గా ప్రారంభమైన వీరభద్రం చౌదరి “దిల్ వాలా”

గ్రాండ్ గా ప్రారంభమైన వీరభద్రం చౌదరి “దిల్ వాలా”

Published on Aug 12, 2022 9:00 PM IST

పూలరంగడు, చుట్టాలబ్బాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రం చౌదరి దర్శకత్వంలో మత్తువదలారా, సేనాపతి చిత్రాలతో ప్రసంశలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నబిషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్న చిత్రం దిల్ వాలా. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు వివి వినాయక్ క్లాప్ ఇవ్వగా, హీరో అల్లరి నరేష్ స్క్రిప్ట్ ని అందించగా, అలీ కెమరా స్విచ్ ఆన్ చేశారు.

అనంతరం దర్శకుడు వీరభద్రం చౌదరి మాట్లాడుతూ, “వివి వినాయక్ గారు సినిమాకి క్లాప్ కొట్టి ఆశీర్వాదించడం చాలా ఆనందంగా వుంది. అలాగే మా మొదటి సినిమా హీరో అల్లరి నరేష్ గారు ఇక్కడి వచ్చి బెస్ట్ విశేష్ అందించడం, అలీ గారు రావడం సంతోషంగా వుంది. మా నిర్మాతలు నబీషేక్, తూము నర్సింహా గారు ఈ చిత్రంతో డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ ని ప్రారంభించారు. నేను మొదలు పెట్టిన నిర్మాతలందరూ చాలా సక్సెస్ అయ్యారు. నబీషేక్ గారు కూడా పెద్ద స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నేను కథ చెప్పగానే అంగీకరించిన నరేష్ అగస్త్యకి థాంక్స్. శ్వేత అవస్తి మంచి నటి. మెరిసే మెరిసే సినిమా చూసి శ్వేతని ఈ చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్నాను. నా చిత్రం పూలరంగడుకి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ చేయడం చాలా ఆనందంగా వుంది. డీవోపీ చేస్తున్న అనిత్ నాకు చాలా కాలంగా తెలుసు. అందరూ మంచి టెక్నిషియన్స్ ఈ చిత్రంలో పని చేస్తున్నారు. ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ పోహిస్తున్నారు. గతంలో నరేష్ అగస్త్య, రాజేంద్రప్రసాద్ గారు సేనాపతి సినిమా చేశారు. అది నాకు చాలా నచ్చింది. అప్పుడే నరేష్ అగస్త్యకి కథ చెప్పడానికి వెళ్ళా. సెప్టెంబర్ లో షూటింగ్ మొదలుపెడతాం. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి మంచి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను” అని అన్నారు.

నరేష్ అగస్త్య మాట్లాడుతూ, “వీరభద్రం చౌదరి గారు కథ చెప్పిన తర్వాత మూడు రోజుల్లోనే సినిమా ఓకే చేశా. ఈ సినిమా కోసం ఎక్కడా రాజీ పడకుండా వందశాతం నా వర్క్ ని ఇస్తా. మొదటిసారి ఒక కమర్షియల్ సినిమా చేయబోతున్నా. నాకు కూడా కొంచెం టెన్షన్ గా వుంది. ఆడియన్స్ కి మరింత దగ్గరవ్వాలని వుంది” అని అన్నారు.

నిర్మాత నబిషేక్ మాట్లాడుతూ, “వీరభద్రం చౌదరి దర్శకత్వంలో డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మాతగా దిల్ వాలా సినిమాతో పరిచయం అవుతున్నా. ఇందులో నరేష్ అగస్త్య కథానాయకుడు. శ్వేత అవస్తి కథానాయిక. ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని నిర్మిస్తాను” అని అన్నారు.

శ్వేత అవస్తి మాట్లాడుతూ, “మంచి టీంతో కలసి పని చేస్తునందుకు చాలా ఆనందంగా వుంది. కథ, కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి థాంక్స్” అని అన్నారు.

అలీ రాజా మాట్లాడుతూ, “దిల్ వాలా అనే మంచి క్రైమ్ కామెడీతో మీ ముందుకు రాబోతున్నాం. నరేష్ నేను పదేళ్ళు తర్వాత కలసి పని చేయబోతున్నాం. 2013లో అన్నపూర్ణలో వీరభద్రం చౌదరి గారు షూటింగ్ లో వున్నప్పుడు ఒక అవకాశం కోసం అడిగేవాళ్ళం. ఎట్టకేలకు ఆయన సినిమాలో అవకాశం దొరికింది” అని అన్నారు.

క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రంలో శ్వేత అవస్తి కథానాయికగా కనిపించనున్నారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, అలీ రాజా, దేవ్ గిల్, అలీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం క్లోసం వీరభద్రం చౌదరి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. ఎక్కడ రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాతలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు