ఇంటర్వ్యూ: డైరెక్టర్ వెంకీ కుడుముల – ‘రాబిన్‌హుడ్’ సినిమాను ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారు!

ఇంటర్వ్యూ: డైరెక్టర్ వెంకీ కుడుముల – ‘రాబిన్‌హుడ్’ సినిమాను ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారు!

Published on Mar 24, 2025 8:03 PM IST

హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాబిన్‌హుడ్’. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకీ కుడుముల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

రాబిన్‌హుడ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది?

భీష్మ సినిమా తర్వాత చిరంజీవి గారి కోసం ఒక కథ అనుకున్నాను. ఆయనకి ఫస్ట్ ఐడియా చెప్తే చాలా ఎక్సైట్ అయ్యారు. నేను చిరంజీవి గారికి ఫ్యాన్ బాయ్ ని. చాలా అద్భుతంగా ఉండాలని స్టోరీ, స్క్రీన్ ప్లే డెవలప్మెంట్ కి చాలా సమయం తీసుకుని చేశాను. అయితే ఎక్కడో ఓ దగ్గర చిరంజీవి గారిని సాటిస్ఫై చేయలేకపోయాను. మేము అనుకున్నలాగా అది అవ్వలేదు. మరో కథతో వస్తానని చెప్పాను. తర్వాత నితిన్ అన్నని కలిశాను. నేను హీరోని బట్టి కథ రాస్తాను. రాబిన్‌హుడ్ ఐడియా ముందే ఉంది. నితిన్ అన్నతో ఫిక్స్ అయ్యాక ఆయనకి తగ్గట్టుగా కథని మలిచాను.

ఇందులో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?

ఇందులో హీరో మాన్యుపులేటర్. ఫిజికల్ స్ట్రెంత్ కంటే మెంటల్ స్ట్రెంత్ స్ట్రాంగ్ అని నమ్మే పర్సన్. సినిమాల్లో ఫస్ట్ 20 మినిట్స్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేయడానికి రకరకాల గెటప్స్ అలరిస్తాయి. 20 నిమిషాల తర్వాత కథ మారిపోతుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా నితిన్ గారి కెరీర్ లో, నా కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుందని నమ్మకం ఉంది. సినిమా అంతా రెగ్యులర్ ఇంట్రవెల్స్ లో ఫన్ ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ ఎంటర్టైనర్ ఇది.

డేవిడ్ వార్నర్ పాత్ర గురించి?

ఇందులో ఒక క్యామియో రోల్ ఇంటర్నేషనల్ స్టార్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. నిర్మాతలు ఎవరని అడిగినప్పుడు డేవిడ్ వార్నర్ అని చెప్పాను. అయితే ఇది సాధ్యమవుతుందని అనుకోలేదు. నిర్మాత రవి గారు చాలా సీరియస్ గా ట్రై చేసి మీటింగ్ అరేంజ్ చేశారు. వార్నర్ ని ఢిల్లీలో కలిసి ప్రజెంటేషన్ ఇచ్చాను. ఆయన చాలా కాన్ఫిడెంట్ గా యాక్ట్ చేశారు. ఆయనకి ఆ కాన్ఫిడెన్స్ ఉండడం వల్లే రీల్స్ కూడా అంత అద్భుతంగా చేయగలిగారు.

శ్రీలీలా క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

టాలెంట్ ఉండడం వేరు. టాలెంట్ ఉందని ఊహించుకోవడం వేరు. ఇందులో శ్రీలీల క్యారెక్టర్ రెండో టైపు. వెరీ ఇంటలెక్చువల్ అనుకునే అమ్మాయి. చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ లో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.

జీవి ప్రకాష్ మ్యూజిక్ గురించి?

ఆయనతో వర్క్ చెయ్యాలని ఎప్పటినుంచో ఉంది. ఆయన కరెక్ట్ టైం కి మ్యూజిక్ డెలివరీ చేసే కంపోజర్. ఇప్పటికే పాటలు కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బిజిఎం కూడా ఎక్స్ట్రార్డినరీగా చేశారు. అది డా సర్ప్రైజ్ పాట కూడా కథలో భాగంగానే వస్తుంది.

కేతిక శర్మ సెలక్షన్ ఎవరిది?

ప్రొడ్యూసర్స్ మొదట పుష్ప సినిమాలో కేతికతో ఒక స్పెషల్ నెంబర్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు కుదరలేదు. ఈ సినిమాలో ఆ ఛాయిస్ ఉన్నప్పుడు కేతిక అయితే బాగుంటుందని అనుకుని ఈ సాంగ్ చేయించాం.

మైత్రి మూవీ మేకర్స్ గురించి?

మైత్రి మూవీ మేకర్స్ ఒకసారి కథ ఓకే చేసిన తర్వాత ఇంక దేని గురించి ఆలోచించరు. వాళ్ళ సపోర్టు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మిస్తారు.

చిరంజీవి గారితో సినిమా ఉంటుందా?

డెఫినెట్ గా చిరంజీవి గారితో సినిమా చేస్తాను

సంబంధిత సమాచారం

తాజా వార్తలు