పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పలు చిత్రాల్లో ప్లాప్ అయినప్పటికీ మంచి క్రేజ్ ఉన్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది “పంజా” అని చెప్పవచ్చు. తన కెరీర్లో సూపర్ స్టైలిష్ లుక్స్ తో చేసిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది కాగా ఈ చిత్రాన్ని కోలీవుడ్ దర్శకుడు విష్ణువర్ధన్ తెరకెక్కించారు. అయితే అప్పట్లో ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ మంచి కల్ట్ ఫాలోయింగ్ ఉంది.
అకీరాతో ఈ సినిమా సీక్వెల్ పై లేటెస్ట్ గా దర్శకుడు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. పంజా పార్ట్ 2 చేయడానికి కాలమే సమాధానం చెప్తుంది ఒకవేళ చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తాను హామీ ఇచ్చారు. దీనితో ఈ సినిమా సీక్వెల్ పట్ల ఫ్యాన్స్ కొంచెం ఆశలు చిగురించాయని చెప్పవచ్చు. ఇక లేటెస్ట్ గా విష్ణు వర్ధన్ తెరకెక్కించిన సినిమా “ప్రేమిస్తావా” రిలీజ్ తెలుగు సహా తమిళ్ లో ఈ జనవరి 30న తీసుకొస్తున్నారు.