హాలీవుడ్ ఆఫర్ వదులుకున్న దిశా..?

Published on Jul 11, 2020 3:04 am IST


డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లోఫర్ లో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ భామ దిశా పటాని బాలీవుడ్ లో బిజీ అయ్యాక టాలీవుడ్ వైపు చూడలేదు . ధోని జీవత కథ ఆధారంగా తెరకెక్కిన ధోని చిత్రంలో నటించగా, ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.గత ఏడాది విడుదలైన భారత్ మూవీలో సల్మాన్ ఖాన్ కి జంటగా నటించి మంచి హిట్ అందుకుంది.

కాగా అమ్మడు ఓ భారీ ఆఫర్ వదులుకుందట. అది కూడా హాలీవుడ్ మూవీ ఆఫర్ అని సమాచారం. ఎందుకో తెలియదు గాని నేను బాలీవుడ్ ఇండస్ట్రీలోనే పాగా వేయాలని చూస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది.ఈ వార్త తెలిసి దిశా అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోసారి సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాధే’ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది దిశా పటాని.

సంబంధిత సమాచారం :

More