హిట్ కాంబినేషన్ లో దివ్యాంశ కౌశిక్ ?

హిట్ కాంబినేషన్ లో దివ్యాంశ కౌశిక్ ?

Published on Sep 24, 2023 11:29 PM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా డాన్ శ్రీను, బలుపు, క్రాక్ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు తీసి మంచి హిట్స్ అందించిన గోపీచంద్ మలినేనితో రవితేజతో మరొక మూవీ చేయడానికి సిద్ధం అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గురించి ఇప్పుడు ఓ సరికొత్త రూమర్ వైరల్ అవుతుంది. రవితేజ కి జోడీగా దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందట. ఇప్పటివరకు ఈ వార్త పై అధికారక ప్రకటన అయితే రాలేదు.

మరి హిట్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ నటిస్తోందో లేదో చూడాలి. ఇక ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ యొక్క పూర్తి వివరాల అనౌన్స్ మెంట్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. అలాగే రవితేజ, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మరొక మూవీ ఈగిల్ ను కూడా చేస్తున్నారు. ఈ మూవీ రానున్న 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు