వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వచ్చిన డీజే టిల్లు కి అద్దిరిపొయే టీఆర్పీ!

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వచ్చిన డీజే టిల్లు కి అద్దిరిపొయే టీఆర్పీ!

Published on Apr 14, 2022 6:03 PM IST

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాల పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన సంగతి అందరికీ తెలిసిందే.

తాజాగా ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సంబంధించిన టీఆర్పీ వచ్చింది. ఈ చిత్రం అర్బన్ ఏరియా లో 10.83 టీఆర్పీ ను రాబట్టగా, అర్బన్ మరియు రూరల్ ప్రాంతాల్లో కలిపి 8.41 గా రావడం విశేషం. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల మరియు రామ్ మిరియాల సంగీతం అందించగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు