ఇది మీకు తెలుసా? “ఇంద్ర” లో ఈ ఎపిసోడ్ మొత్తాన్ని డైరెక్ట్ చేసింది చిరు అని

ఇది మీకు తెలుసా? “ఇంద్ర” లో ఈ ఎపిసోడ్ మొత్తాన్ని డైరెక్ట్ చేసింది చిరు అని

Published on Aug 22, 2024 9:00 AM IST

టాలీవుడ్ బాస్ ఆఫ్ మాసెస్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు భారీ చిత్రం “విశ్వంభర” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి నేడు తన బర్త్ డే కానుకగా గ్రాండ్ ట్రీట్ రాబోతుండగా దానితో పాటుగా నేడు మెగాస్టార్ సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ చిత్రం “ఇంద్ర” కూడా రీ రిలీజ్ కి వచ్చింది. మరి ఈ చిత్రం హంగామా థియేటర్స్ లో నెక్స్ట్ లెవెల్లో ఉండగా ఈ సినిమా రీ రిలీజ్ తో మళ్లీ మెగా అభిమానులు 22 ఏళ్ళు వెనక్కు వెళ్లిపోయారు.

అయితే ఈ సినిమా విషయంలో చాలా మందికి తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అలా ఒక ఇంట్రెస్టింగ్ ప్యాక్ట్ ఏమిటంటే ఈ సినిమాలో ఒక ఎపిసోడ్ మొత్తాన్ని చిరంజీవే అప్పట్లో డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకి బి గోపాల్ దర్శకత్వం వహించినప్పటికీ అన్ని సీన్స్ తను తియ్యలేదట. అలా ఇంద్ర సినిమాలో మోస్ట్ పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తాన్ని చిరంజీవే తెరకెక్కించారని మీకు తెలుసా? అవును ఇది నిజమే.

అప్పట్లో బి గోపాల్ ప్రభాస్ అడవి రాముడు షూటింగ్ కూడా చేయాల్సి ఉన్న సందర్భంగా మెగాస్టార్ ఇంద్ర దర్శకత్వ భాద్యతలు తీసుకున్నారట. అలా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తాన్ని చిరు నటిస్తూనే దర్శకత్వం వహించారట. ఇది మాత్రం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించిన సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు