ఇది మీకు తెలుసా? “ఇంద్ర”లో ఈ పవర్ఫుల్ డైలాగ్స్ అన్నీ ముందు లేవని.. మరెలా సెట్ చేసారంటే

ఇది మీకు తెలుసా? “ఇంద్ర”లో ఈ పవర్ఫుల్ డైలాగ్స్ అన్నీ ముందు లేవని.. మరెలా సెట్ చేసారంటే

Published on Aug 18, 2024 10:00 PM IST


తెలుగు సినిమా గర్వించదగ్గ అతి కొద్ది మంది దిగ్గజ స్టార్ హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. మరి ఇప్పుడు తెలుగు సినిమాకి మూల విరాట్ గా కూడా అంతా భావిస్తారు. మరి ఇప్పుడు చిరు “విశ్వంభర” అనే భారీ ఫాంటసీ సినిమా చేస్తుండగా దీనిని తాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ క్రమంలో తన పుట్టినరోజు కూడా వస్తుంది.

ఈసారి బర్త్ డేకి మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ “ఇంద్ర” చిత్రాన్ని మేకర్స్ థియేటర్స్ లోకి దింపనుండగా ఆల్రెడీ భారీ బుకింగ్స్ ఈ చిత్రానికి నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ఇంద్ర ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. మరి ఈ సమయంలో ఇంద్ర సినిమా కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ తెలుసుకుందాం.

ఈ చిత్రాన్ని దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించగా 2002 లో వచ్చి సునామి సృష్టించింది. ఆ టైం లో ఫ్యాక్షన్ సినిమాలకి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అలా చిరంజీవితో ప్లాన్ చేసిన ఈ సినిమాని మేకర్స్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి తీసారట. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ పలికిన ప్రతీ పవర్ఫుల్ డైలాగ్ థియేటర్స్ లో గట్టిగా పేలింది.

ఇప్పటికీ కూడా వాటికి విజిల్స్ పడతాయి. అయితే ఇలాంటి డైలాగ్స్ విషయంలో మెగాస్టార్ చిరంజీవే కొంచెం రెస్ట్రిక్ట్ చేసారని మీకు తెలుసా? మొదట్లో తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ డైలాగ్స్ మాత్రమే రాయాలని ఓవర్ గా అనిపించే డైలాగ్స్ లాంటివి వద్దని చిరు రచయిత పరుచూరి గోపాలకృష్ణకి చెప్పారట. నా అభిమానులు డైలాగ్స్ కంటే డాన్స్ స్టెప్ లు అడుగుతారని అందుకే కొంచెం తక్కువ మోతాదు ఉన్న డైలాగ్స్ నే రాయాలని చెప్పారట.

కానీ ఒక్కరోజు సినిమా ఆడియో ఫంక్షన్ రోజున చిరుకి ఫ్యాన్స్ షాకిచ్చారు. ఎప్పుడు ఒక స్టెప్ వెయ్యమని అడిగే అభిమానులు సినిమా నుంచి డైలాగ్ చెప్పమని అడగడంతో అప్పుడు చిరు అందరికీ చెప్పి ఏం డైలాగులు అనుకున్నారో మొత్తం కక్కండి అని చెప్తే అక్కడ నుంచే మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా.. లాంటి డైలాగ్స్ పెట్టారట. ఇంద్ర ఆడియో ఫంక్షన్ నాటికి 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిపోగా మిగతా 20 శాతంలోనే చిరు కోసం అనుకున్న డైలాగ్స్ అన్ని చెప్పించారని పరుచూరి వెల్లడించారు.

మరి ఆరోజున కానీ ఆడియో ఫంక్షన్ లో అభిమానులు అంతలా అడిగి ఉండకుంటే ఇంద్ర లో చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ని అయ్యిపోయి ఉండేవాళ్లమని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ ఆగస్ట్ 22న మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఇంద్ర రీ రిలీజ్ కి రాబోతుంది. ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో చూడాల్సిందే. మరి ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించగా ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రేలు ఫీమేల్ లీడ్ లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు