‘స్పిరిట్’ కోసం సందీప్ రెడ్డి ఎదురుచూపులు తప్పవా..?

‘స్పిరిట్’ కోసం సందీప్ రెడ్డి ఎదురుచూపులు తప్పవా..?

Published on Jan 16, 2025 1:09 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతూ అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటిస్తున్న ‘ది రాజా సాబ్’ షూటింగ్ ముగింపుకు చేరుకుంది. ఈ సినిమాతో పాటు ఆయన మరో సినిమా ‘ఫౌజీ’ కూడా రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాను ప్రారంభించాలని చూస్తున్నాడు.

అయితే, ఇప్పుడు ఈ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ మరికొంత కాలం వెయిట్ చేయడం తప్పేలా లేదు. ప్రభాస్ ఇప్పటికే ‘సలార్-2’ సినిమా చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో పాటు ‘కల్కి 2898 ఎడి’ సీక్వెల్ కూడా చేయాల్సి ఉంది. అయితే, ఇప్పుడు ‘కల్కి’ మేకర్స్ నుంచి ప్రభాస్‌పై ఒత్తిడి వస్తుందని.. త్వరలో సీక్వెల్ చిత్రాన్ని ప్రారంభించి, 2026లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

ఈ లెక్కన ప్రభాస్ ‘కల్కి’ సీక్వెల్ మూవీకే ఓటేస్తే, సందీప్ రెడ్డి వంగ మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే అని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో.. ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రాన్ని ఎప్పుడు ప్రారంభిస్తాడా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు