‘దూరదర్శిని’ మూవీ చూసి ఇది నా కథ అనుకుంటారు : హీరో సువిక్షిత్

సువిక్షిత్‌ బొజ్జ, గీతిక రతన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘దూరదర్శిని’. ‘కలిపింది ఇద్దరిని’ అనేది ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వారాహ మూవీ మేకర్స్‌ పతాకంపై బి.సాయి ప్రతాప్‌ రెడ్డి, జయ శంకర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. 1990వ నేపథ్యంలో అందరి హృదయాలను హత్తుకునే ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్‌ టీజర్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌పీ.పట్నాయక్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆర్‌పీ.పట్నాయక్‌ మాట్లాడుతూ.. ”ఈ చిత్ర కథానాయకుడు చాలా కాలంగా తెలుసు. జెమిని సురేష్‌ ఈ సినిమా గురించి చాలా చెప్పాడు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పే వాడు. ఈ సినిమాకు చాలా పాజిటివ్‌ వైబ్స్‌ ఉన్నాయి. ఈ సినిమా అందరిని 90వ దశకంలోకి తీసుకెళ్లి మీ జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది. అందరికీ వాళ్ల ప్రేమకథలు కూడా గుర్తుకు వస్తాయి. ఈ సినిమా విజయం సాధించి టీమ్‌ అందరికి మంచి గుర్తింపు తీసుకరావాలి’ అన్నారు.

గీతిక మాట్లాడుతూ.. ‘దూరదర్శిని సినిమా చాలా మంచి చిత్రం. తప్పకుండా అందరికి తమ మరపురాని రోజులను గుర్తుకు తెస్తుంది. నాకు ఈ చిత్రంలో అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషపడుతున్నాను. ఈ సినిమాలో దూరదర్శిని వాణి, హరిల ప్రేమను ఎలా కలిపింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది’ అని అన్నారు.

హీరో సువిక్షిత్‌ మాట్లాడుతూ.. ‘1990వ నేపథ్యంలో నడిచే కథ. అందరికి కనెక్ట్‌ అయ్యే కథ ఇది. బ్యాక్‌డ్రాప్‌కు తగ్గ నటీనటులతో, లోకేషన్స్‌తో ఎంతో సహజంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాలో ఉన్న ఎమోషనే ఈ చిత్రంలోని ప్లస్‌ పాయింట్‌. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇది నా కథ అనుకుంటారు. తప్పకుండా చిత్రాన్ని అందరూ ఎంతో బాగా ఎంజాయ్‌ చేస్తారు’ అని అన్నారు.

Exit mobile version