కళ్యాణ్ రామ్ “డెవిల్” నుండి దూరమే తీరమై సాంగ్ ప్రోమో రేపు రిలీజ్!

కళ్యాణ్ రామ్ “డెవిల్” నుండి దూరమే తీరమై సాంగ్ ప్రోమో రేపు రిలీజ్!

Published on Dec 15, 2023 1:00 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో, ప్రముఖ నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామా దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ డెవిల్. ఈ చిత్రం డిసెంబర్ 29, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం రిలీజ్ డేట్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రం నుండి మేకర్స్ రేపు దూరమే తీరమై సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. సంయుక్త మీనన్, మాళవిక నాయర్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు