సమీక్ష : దొరసాని – ప్రేమ కథలు ఇష్టపడే వారికి మాత్రమే !

సమీక్ష : దొరసాని – ప్రేమ కథలు ఇష్టపడే వారికి మాత్రమే !

Published on Jul 13, 2019 3:02 AM IST
Dorasaani movie review

విడుదల తేదీ : జూలై 12, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5

నటీనటులు : ఆనంద్ దేవరకొండ, శివాత్మిక

దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర

నిర్మాత‌లు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని

సంగీతం : ప్రశాంత్ ఆర్ వర్మ

సినిమాటోగ్రఫర్ : సన్నీ కూరపాటి

ఎడిటర్ : నవీన్ నూలి

 

కె.వి.ఆర్ మ‌హేంద్ర దర్శకత్వంలో శివాత్మిక రాజ‌శేఖ‌ర్ – ఆనంద్ దేవ‌ర‌కొండ‌లను హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ మ‌ధురా ఎంట‌ర్ టైన్మెంట్, బిగ్ బెన్ సిన‌మాలు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘దొర‌సాని’. కాగా ఈ సినిమా ఈ రోజే విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

తక్కువ కులానికి చెందిన పేద కుటుంబంలో పుట్టిన రాజు (ఆనంద్ దేవరకొండ) దొర కూతురు ‘చిన్న దొరసాని’ దేవకి(శివాత్మిక)ని చూడగానే ప్రేమిస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ‘చిన్న దొరసాని’ దేవకి కూడా రాజు కవితలను ఇష్ట పడుతుంది. అలా మొదలైన వారి ప్రయాణం ఒకరి పై ఒకరికి అమితమైన ప్రేమ పుట్టేలా దారి తీస్తోంది. ఈ క్రమంలో అనుకోకుండా ‘అన్నలు నక్స్ లైట్లు’ వాళ్ళ ప్రేమకు ఎలా ఉపయోగపడ్డారు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ‘రాజు – దేవకి’ ప్రేమ గురించి దొరకు తెలుస్తోంది. దొర వారి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించడంతో వారి కథ ఎలా మలుపు తిరుగుతుంది ? రాజు ప్రేమ కోసం ఎలాంటి కష్టాలు పడ్డాడు ? చివరికి రాజు – దేవకి ఒక్కటయ్యారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర ఈ సినిమాని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

 

సినిమాలో నేటివిటీకి సంబంధించిన స్టోరీ వరల్డ్ మరియు దొర వ్యవస్థలోని దొర కట్టుబాట్లు పట్టుదలల కారణంగా ఒక స్వచ్ఛమైన ప్రేమ కోసం ప్రేమికులు పడే సంఘర్షణ.. అలాగే పక్కా తెలంగాణ యాసలో డైలాగులు, ఆనాటి కాలాన్ని ప్రతిబింబించేలా నేపధ్యం, లొకేషన్లు, నటీనటుల నుండి రాబట్టుకున్న సహజసిద్ధమైన నటన వంటి అంశాలు సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ముఖ్యంగా బయట ప్రపంచం అంటే ఏంటో తెలీని దొరసానితో రాజు ప్రేమలో పడే సన్నివేశాలు బాగున్నాయి. ఇద్దరూ తమ ప్రేమను ఒకరికొకరు ఎక్స్‌ ప్రెస్‌ చేసుకునే సన్నివేశం కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తోంది.

ఇక హీరోహీరోయిన్లు నటించిన ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ ఇద్దరూ తమ పాత్రల్లో చాలా బాగా నటించారు. మెయిన్ గా శివాత్మిక రాజశేఖర్ తన సహజసిద్ధమైన నటనతో అద్భుతంగా నటించింది. చూడటానికి దొరసానిలా గంభీరంగా కనిపిస్తూ .. కళ్లతోనే ముఖ్యమైన హావభావాలను పలికిస్తూ.. సినిమాలోనే హైలెట్ గా నిలిచింది. అలాగే ఆనంద్ దేవరకొండ కూడా తన పాత్ర కోసం కొన్ని ఇబ్బందికర షాట్స్ లో కూడా నటించి ఆకట్టుకున్నాడు.

సినిమాలో శివాత్మిక రాజశేఖర్ తండ్రిగా నటించిన నటుడు కూడా తన నటనతో పాటు ఆయన చెప్పిన కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇక హీరోకి ఫ్రెండ్స్ గా నటించిన నటులు కూడా తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్ని చోట్ల నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

 

పేదింటి కుర్రాడు, డబ్బున్న అమ్మాయితో ప్రేమలో పడటం అన్న కాన్సెప్ట్‌ ఇప్పటికే చాలా లవ్ స్టోరీల్లో చూశాం. దాంతో స్టోరీ పరంగా ఈ సినిమాలో కొత్తగా ఏమి లేదు. అయితే కథా నేపథ్యం మరియు ఆ నేపథ్యంలోని పాత్రల పరంగా ఎలాంటి వంకా పెట్టలేని పనితీరుని కనబర్చిన దర్శకుడు.. కథనం విషయంలో మాత్రం చాలా నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని ప్రేమ సన్నివేశాలు ఇంకా కుదించి ఉంటే బాగుండేది. అలాగే కథకు అవసరం లేని కొన్ని సాగతీత సీన్స్ ను కూడా తగ్గించాల్సింది.

ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో కీలక సన్నివేశాలు సంబంధించిన సంఘర్షణ కూడా బలంగా ఎలివేట్ కాలేదు. దీనికి తోడు కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగుతాయి. అయితే బలమైన క్లైమాక్స్ తో మెయిన్ ఎమోషన్ హైలెట్ అయింది. ఇక సినిమాలో యూత్ ని ఆకట్టుకునే పక్కా కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడంతో.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫలితాన్ని కొంతవరకు దెబ్బతీస్తుందనే చెప్పాలి. పైగా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులను ఈ సినిమా పూర్తి స్థాయిలో మెప్పించదు.

 

సాంకేతిక విభాగం :

 

కె.వి.ఆర్ మ‌హేంద్ర మంచి నేపథ్యంలో ఆసక్తికరమైన పాత్రలతో ఈ సినిమాను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినా.. కథనం విషయంలో మాత్రం బాగా నెమ్మదిగా కనిపించారు. సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి తగట్లు ఆకట్టుకుంటుంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా అప్పటి కాలాన్ని గుర్తు చేస్తూ నడుస్తాయి. నిర్మాతలు ఇలాంటి చిత్రాన్ని నిర్మిచినందుకు అభినందించి తీరాలి. నిర్మాతల ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.

 

తీర్పు :

 

కె.వి.ఆర్ మ‌హేంద్ర దర్శకత్వంలో శివాత్మిక రాజ‌శేఖ‌ర్ – ఆనంద్ దేవ‌ర‌కొండ‌ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం బలమైన నేపథ్యంతో, భావేద్వేగమైన ప్రేమ కథతో, కొన్ని ప్రేమ సన్నివేశాలతో బాగానే ఆకట్టుకునప్పటికీ… స్టోరీ కాన్సెప్ట్‌ రొటీన్ గా ఉండటం, కథనం బాగా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం, సినిమాలో పక్కా కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని కొంతమేరకు దెబ్బ తీశాయి. మొత్తంమీద ఈ సినిమా మంచి ఫ్యూర్ ప్రేమ కథా చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ అవుతుంది. అయితే మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతవరకు అలరిస్తోందో చూడాలి.

Click Here For English Review

123telugu.com Rating :   2.75/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు