ఎనర్జిటిక్ గా “డబుల్ ఇస్మార్ట్” ఫస్ట్ సింగిల్ ప్రోమో


మన టాలీవుడ్ యంగ్ హీరోస్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “డబుల్ ఇస్మార్ట్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు మంచి కేజ్రీగా ఎదురు చూస్తుండగా మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ రేంజ్ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పై ఇప్పటికే మంచి బజ్ నెలకొనగా ఇప్పుడు దీని తాలూకా ఫస్ట్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఇది మాత్రం మరో చార్ట్ బస్టర్ లా అనిపిస్తుంది అని చెప్పాలి. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ సింగిల్ ఏ రేంజ్ లో కిక్ ఇచ్చిందో దానికి డబుల్ కిక్ ఇచ్చే బీట్స్ ని మణిశర్మ అందించగా రామ్ మాస్ స్లాంగ్ తో ఈ ప్రోమో అదిరిపోయింది అని చెప్పాలి.

ఇక ఈ ఫుల్ సాంగ్ అయితే ఈ జూలై 1న రిలీజ్ చేస్తున్నట్టుగా ఈ ప్రోమోతో రివీల్ చేశారు. మరి ఇదెలా ఉంటుందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తుండగా ఈ ఆగస్ట్ 15న సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version