హిందీ వెర్షన్ లో రికార్డు రెస్పాన్స్ తో దుమ్ము లేపిన “స్కంద”


టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా ఇప్పుడు మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సాలిడ్ చిత్రం “డబుల్ ఇస్మార్ట్” లో చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈ ఆగస్ట్ 15న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది. అయితే దీనికి ముందు రామ్ నటించిన సాలిడ్ యాక్షన్ డ్రామా చిత్రం “స్కంద” కోసం అందరికీ తెలిసిందే.

మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం మెన్స్ ఆడియెన్స్ కి బాగానే ఎక్కింది. అయితే ఈ చిత్రాన్ని కూడా మేకర్స్ పాన్ ఇండియా రిలీజ్ కే ప్లాన్ చేశారు కానీ అది తర్వాత ఒక్క తెలుగులోనే వచ్చింది. అయితే ఈ చిత్రం హిందీ వెర్షన్ యూట్యూబ్ లో రిలీజ్ కి వచ్చిన సంగతి తెలిసిందే. మరి హిందీలో మాత్రం ఈ సినిమా రికార్డు రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.

హిందీలో ఈ సినిమా ఏకంగా ఇప్పుడు 100 మిలియన్ రికార్డు మార్క్ వ్యూస్ ని దాటి అదరగొట్టింది. అంతే కాకుండా 1 మిలియన్ కి పైగా లైక్స్ ని సొంతం చేసుకొని సత్తా చాటింది. మరి గతంలో ఇస్మార్ట్ శంకర్ కి కూడా హిందీలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇపుడు మళ్ళీ స్కంద తో రామ్ పోతినేని సత్తా చాటాడు అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు అలాగే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version