రామ్ “డబుల్ ఇస్మార్ట్” ఫస్ట్ సింగిల్ కి టైమ్ ఫిక్స్!

ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎనర్జిటిక్ స్టార్, హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ తో మళ్లీ వస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ ను షురూ చేశారు. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ అయిన స్టెప్ప మార్ ను జూలై 1 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ప్రోమో ను రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పూర్తి పాటను రేపు సాయంత్రం 4:00 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అదే విషయాన్ని వెల్లడించడానికి ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ లు నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Exit mobile version