విడుదల తేదీ : ఆగస్టు 15, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, ఝాన్సీ, ప్రగతి, ఆలీ, గెటప్ శ్రీను తదితరులు.
దర్శకుడు: పూరి జగన్నాథ్
నిర్మాతలు : పూరి కనెక్ట్స్
సంగీత దర్శకుడు: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
ఎడిటర్ : జునైద్
సంబంధిత లింక్స్: ట్రైలర్
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ హిట్ చిత్రం “ఇస్మార్ట్ శంకర్” కి సీక్వెల్ “డబుల్ ఇస్మార్ట్” ని అయితే మేకర్స్ ఈ స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల చేశారు. మరి ఈ చిత్రం ఎంత వరకు మెప్పించిందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఇక ఈసారి కథ లోకి వస్తే.. ఇంటర్నేషనల్ గా పేరు మోసిన మాఫియా డాన్, మేజర్ గా గన్స్ సప్లై చేసే బిగ్ బుల్ (సంజయ్ దత్) కి ఓరోజు తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలుస్తోంది. దీనితో తన సామ్రాజ్యాన్ని మరో 100 ఏళ్ళు డిజైన్ చేసుకున్న తను చనిపోవడానికి ఇష్టపడడు. ఇలా ఓ డాక్టర్ ద్వారా మెమోరీ ట్రాన్స్ఫర్ కోసం తెలుసుకుంటాడు. మరి దీనికి సరైన మనుషుల్ని ప్రయోగం కోసం వెతుకుతున్న సమయంలో హైదరాబాద్ లో ఉన్న ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ (రామ్ పోతినేని) కోసం తెలుసుకుంటాడు. ఇక అక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరిగింది? శంకర్ ని బిగ్ బుల్ ఏం చేస్తాడు? బిగ్ బుల్ వల్ల శంకర్ జీవితంలో జరిగిన విషాదం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
మొదటిగా నటీనటుల పెర్ఫార్మన్స్ ల విషయానికి వస్తే.. రామ్ మరోసారి తన మాస్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడని చెప్పాలి. తన లుక్స్ పక్కా తెలంగాణ యాసలో గత ఇస్మార్ట్ శంకర్ తరహాలోనే ఈసారి కూడా తన స్వాగ్ చూపించాడు. అలాగే మరో షేడ్ లో కూడా తనలో వేరియేషన్ ని చూపించాడు.
ఇక హీరోయిన్ కావ్య థాపర్ కూడా తన రోల్ లో ఫిట్ అయ్యింది. రామ్ తో కొన్ని సీన్స్ బాగున్నాయి. అలాగే తన గ్లామర్ షో కూడా మాస్ ఆడియెన్స్ కి నచ్చుతుంది. అలాగే ఫైట్స్ కూడా బాగా చేసింది.. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన రోల్ లో స్టైలిష్ డాన్ గా కనిపించారు. ఇంకా సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ కొన్ని మాస్ మూమెంట్స్, పోలీస్ స్టేషన్ ఫైట్ బాగున్నాయి.
మైనస్ పాయింట్స్:
ఇస్మార్ట్ శంకర్ మాస్ ఆడియెన్స్ లో ఎలాంటి ఇంపాక్ట్ సెట్ చేసిందో అందరికీ తెలుసు.. సో దానికి సీక్వెల్ అంటే మినిమం అంచనాలు పెట్టుకొనే వెళ్తారు ప్రేక్షకులు కానీ ఈ చిత్రం వాటిని రీచ్ అయ్యే లెవెల్లో లేదని చెప్పక తప్పదు. ఈసారి పూరీ జగన్నాథ్ ఏదో ట్రై చేశారు కానీ తన వర్క్ డిజప్పాయింట్ చేస్తుంది.
ఫోర్సెడ్ ఎమోషన్స్ ఆకట్టుకోని కథనం సినిమాని చప్పగా మార్చాయి. ఎక్కడో కొన్ని సీన్స్ తప్పితే అసలు సినిమాలో పెద్దగా చెప్పుకోడానికి ఏమి లేదు. మొదటి సగమే ఏదో ఓకే అనిపించే రేంజ్ లో అనిపిస్తే మలిసగం పరిస్థితి కూడా ఇదే రీతిలో కొనసాగుతుంది. మెయిన్ గా పూరి మార్క్ మాస్ సీన్స్ కానీ పంచ్ డైలాగ్స్ కానీ సినిమాలో లేవు. వీటిని ఆశించే వారు మరింత డిజప్పాయింట్ అవుతారు.
ఇక సంజయ్ దత్ రోల్ ఇంకా పెద్ద డిజప్పాయింటింగ్ అని చెప్పాలి. సినిమాలో తన రోల్ చాలా అసహజంగా అనిపిస్తుంది. తన పర్సనాలిటీకి తను చేసే పనులు నటన అంత ఇంట్రెస్ట్ గా ఏమి కనిపించవు. అలాగే సినిమాలో లాజిక్స్ కూడా పెద్దగా లేవు.. అలాగే పూరీ ఆలీ కామెడీ ట్రాక్ అంటే కొన్ని అంచనాలు ఉంటాయి కానీ ఈ సినిమాలో ట్రాక్ పెద్దగా నవ్వు కూడా తెప్పించదు. ఇంకా క్లైమాక్స్ ఎపిసోడ్ ని కూడా మరింత బాగా డిజైన్ చేయాల్సింది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో ఛార్మి, పూరి జగన్నాథ్ ల నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా సెటప్, కావాల్సిన సెట్టింగ్ వర్క్స్ బాగున్నాయి. అలాగే టెక్నికల్ టీం లో మణిశర్మ వర్క్ జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ స్కోర్ బాగుంది కానీ కొన్ని సీన్స్ లో మిస్ అయ్యింది. రాజ్ తోట ఇచ్చిన విజువల్స్ బాగున్నాయి. జునైద్ ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. కొన్ని సీన్స్ లో ఆడియో సింక్ కూడా మిస్ అయ్యింది.
ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ విషయానికి వస్తే.. తను ఈ సినిమాకి ఒక డల్ వర్క్ అందించారు అని చెప్పక తప్పదు. తన మార్క్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ బాగా మిస్ అయ్యాయి. కథనం కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఏమి సాగలేదు. దీనికంటే పార్ట్ 1 కి పెట్టిన ఎఫర్ట్స్ అన్ని వర్గాల్లో కూడా చాలా బెటర్ అని చెప్పొచ్చు.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే.. మాస్ హిట్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం దానికి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనుకుంటే అందులో సగాన్ని కూడా రీచ్ కాలేకపోయింది అని చెప్పొచ్చు. లిమిటెడ్ గా కనిపించిన మాస్ మూమెంట్స్ ఓకే, రామ్ తన రోల్ ని బాగానే చేసేసాడు. కావ్య కూడా బాగానే కనిపించింది కానీ పూరి వర్క్ మాత్రం అంచనాలు రీచ్ అయ్యే రేంజ్ లో లేదు. పార్ట్ 1 చూసి దీనిపై ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే తప్పకుండా డిజప్పాయింట్ అవుతారు. ఎంత తక్కువ అంచనాలు పెట్టుకొని చూసినా ఇది కాదు కదా పూరి సినిమా అనే భావన తన అభిమానుల్లో కలుగుతుంది. వీటితో సినిమా బిలో యావరేజ్ గానే మిగిలిపోయింది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team