పాటల చిత్రీకరణలో రామ్ “డబుల్ ఇస్మార్ట్”

పాటల చిత్రీకరణలో రామ్ “డబుల్ ఇస్మార్ట్”

Published on Jun 16, 2024 6:30 PM IST

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్. సూపర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్‌ కి ఈ చిత్రం సీక్వెల్ గా తెరకెక్కుతోంది. కావ్యా థాపర్‌ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై అందరినీ ఆకట్టుకుంది. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానుంది ఈ చిత్రం.

ఈ చిత్రం ఇప్పటికే మొత్తం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కేవలం మూడు పాటల చిత్రీకరణ బ్యాలన్స్ ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మి కౌర్, పూరీ జగన్నాధ్ నిర్మిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు