రామ్ “డబుల్ ఇస్మార్ట్” డిజిటల్ పార్ట్ నర్ ఫిక్స్!

రామ్ పోతినేని హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్. ఈ చిత్రం ను ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో నెగెటివ్ రోల్ లో నటిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో సూపర్ హిట్ సాధించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రంకు సంబందించిన ఓటిటి రైట్స్ పై క్లారిటీ వచ్చింది.

ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన అమేజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని సొంతం చేసుకుంది. కేవలం సౌత్ భాషల హక్కులని ఈ చిత్రం 33 కోట్ల రూపాయలకి దక్కించుకుంది. హిందీ ఓటిటి రైట్స్ పై క్లారిటీ రావాల్సి ఉంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Exit mobile version