ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్ (Double ismart). ఈ చిత్రం ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి మే 15 వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే టీజర్ కి సంబందించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ నేడు అందించారు.
85 సెకన్ల నిడివి తో టీజర్ ఉండనుంది. ఇది ప్యూర్ రామ్ పోతినేని మ్యాడ్ నెస్ తో ఉండనుంది అని మేకర్స్ హామీ ఇస్తున్నారు. ఈ టీజర్ పై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. రామ్ ను మరోసారి మాస్ మేకోవర్ లో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రం లో కీలక పాత్రలో నటిస్తున్నారు.