‘ప్రభాస్’ బర్త్ డే నాడు ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ …?

‘ప్రభాస్’ బర్త్ డే నాడు ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ …?

Published on Oct 18, 2022 10:59 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం మొత్తం మూడు సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వాటిలో ముందుగా మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ సంక్రాంతి కానుకగా 2023, జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానుంది. అలానే కెజిఎఫ్ మూవీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీస్తున్న సలార్ సెప్టెంబర్ 28న, ఇక సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ ప్రాజెక్ట్ కె 2024 ప్రథమార్ధంలో రానున్నాయి.

ప్రస్తుతం ఈ మూడు మూవీస్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు ప్రభాస్. అయితే విషయం ఏమిటంటే అక్టోబర్ 23 న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మొత్తం రెండు సర్ప్రైజ్ లు ప్రభాస్ ఫ్యాన్స్ కోసం సిద్ధం అవుతున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ముందుగా ఆదిపురుష్ నుండి ఆ రోజున ఒక సర్ప్రైజ్ ఉండడనుండగా అలానే సలార్ టీమ్ నుండి కూడా ఒక ట్రీట్ రానుందట. ఈ విధంగా ప్రభాస్ బర్త్ డే నాడు మొత్తం రెండు అప్ డేట్స్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ అందించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు