ఫిబ్రవరి 4న రాజశేఖర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ !

ఫిబ్రవరి 4న రాజశేఖర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ !

Published on Jan 31, 2017 8:49 PM IST


ఒకప్పుడు ‘అంకుశం’ వంటి గొప్ప చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు డా. రాజశేఖర్. ఈ మధ్యకాలంలో సినిమాలు ట్రెండ్ మారడంతో ఆయనకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆయన తనకు కెరీర్లో గొప్ప బ్రేక్ ఇచ్చిన పోలీస్ పాత్రనే మళ్ళీ చేస్తున్నారు. ‘గుంటూరు టాకీస్’ చిత్రంతో సంచలన విజయం సాదించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో రాజశేఖర్ ఒక సినిమా చేస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను ఫిబ్రవరి 4న రాజశేఖర్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ సరసన ‘విశ్వరూపం’ చిత్రంలో నటించిన పూజ కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కూడా ప్రవీణ్ సత్తారు గత సినిమాల్లాగే చాలా రియలిస్టిక్ గా ఉంటుందని, రాజశేఖర్ కు కూడా మంచి బ్రేక్ ఇస్తుందని ఈ చిత్ర సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు