లైఫ్ లో డ్రామా వద్దంటున్న “మత్తు వదలరా 2” టీమ్!

లైఫ్ లో డ్రామా వద్దంటున్న “మత్తు వదలరా 2” టీమ్!

Published on Sep 6, 2024 10:46 PM IST


రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ మత్తు వదలరా 2. 2019 లో రిలీజైన మత్తు వదలరా చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 13, 2024 న థియేటర్ల లోకి రాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి రిలీజ్ అవుతున్న ప్రచార చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ డేట్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఒక ప్రమోషనల్ సాంగ్ ను తాజాగా విడుదల చేసారు.

డ్రామా నక్కో మామా అంటూ సాగే ఈ పాట అలరిస్తుంది. పాట అంతా కూడా హిందీలో ఉండగా, టీమ్ అంతా కూడా ఈ సాంగ్ లో ఉన్నారు. శ్రీ సింహ, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్ లు ఈ ప్రమోషనల్ సాంగ్ లో కనిపించారు. సాంగ్ మొదలు మరియు చివర కూడా సెటైరికల్ కామెడీ మనం చూడవచ్చు. లైఫ్ లో డ్రామా వద్దు అంటూ ఉన్న ఈ సాంగ్ కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. క్లాప్ ఎంటర్టైన్మెంట్ మరియు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు