‘డ్రీమ్ క్యాచర్’ మూవీ సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ సందీప్ కాకుల

ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డ్రీమ్ క్యాచర్’. ఈ చిత్రాన్ని సీయెల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు సందీప్ కాకుల రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘డ్రీమ్ క్యాచర్’ సినిమా జనవరి 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ప్రెస్‌మీట్‌ను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నటుడు శ్రీనివాస్ రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘డ్రీమ్ క్యాచర్ సినిమాలో కార్తీక్ అనే క్యారెక్టర్ చేశాను. మనమంతా జీవితంలో ఏదో ఒక సందర్భంలో జరిగిన ఇన్సిడెంట్‌లో స్ట్రక్ అయిపోయి ఉంటాం. ఆ ఘటన జరిగినప్పుడు మనసులో ఒక సంఘర్షణ మొదలవుతుంది. అలా తన జీవితంలో జరిగిన ఓ ఘటన ప్రభావం నుంచి బయటపడేందుకు హీరో ఎలా ప్రయత్నించాడు అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా మా దర్శకుడు సందీప్ తెరకెక్కించాడు. ఇలాంటి పర్పెక్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని మీరంతా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా.’ అని అన్నారు.

హీరో ప్రశాంత్ కృష్ణ మాట్లాడుతూ.. ‘నాలుగేళ్ల కిందట సందీప్ ‘డ్రీమ్ క్యాచర్’ సినిమా ఆడిషన్ కోసం పిలిచారు. ఇప్పుడు ఈ వేదిక మీద మేమంతా ఉన్నామంటే కారణంగా మా సందీప్. టీమ్‌లోని ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళ్తూ ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమాను కంప్లీట్ చేశాడు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఈ సినిమా మీ అందరికీ ఇస్తుంది. ‘డ్రీమ్ క్యాచర్’ మూవీ మిమ్మల్ని డెఫనెట్‌గా ఆకట్టుకుంటుంది.’ అని అన్నారు.

డైరెక్టర్ సందీప్ కాకుల మాట్లాడుతూ.. ‘సినిమా చేయాలనేది నా డ్రీమ్. కలల మీద సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ ‘డ్రీమ్ క్యాచర్’ మూవీ మొదలైంది. మనకున్న రిసోర్సెస్‌లో మొత్తం హైదరాబాద్‌లోనే సినిమా రూపొందించాను. ట్రైలర్, పోస్టర్స్ చూసి ఈ మూవీ ఎక్కడ షూటింగ్ చేశారని అడుగుతున్నారు. కలల నేపథ్యంగా ఇలాంటి సినిమా ఇప్పటిదాకా తెలుగులో రాలేదని చెప్పగలను. గంటన్నర నిడివితో సినిమా ఉంటుంది. పాటలు ఫైట్స్ ఉండవు. అవి లేకుండా కేవలం కథ మీదనే మూవీ వెళ్తుంది. ఒక మంచి మూవీ చేస్తే ఎక్కడైనా ఆదరిస్తారని నమ్మాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ సిటీస్‌లో ప్రమోషన్ చేస్తున్నాం. జనవరి 3న ‘డ్రీమ్ క్యాచర్’ సినిమాను థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయండి.’ అని అన్నారు.

Exit mobile version