టాలీవుడ్ లో తమ స్వయం కృషితో మంచి టాలెంట్ ఉంటే పైకి వచ్చిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. తమదైన నటన, నడవడికతో మెప్పిస్తే చాలు తెలుగు ప్రేక్షకులు తమ ఆదరణ చూపిస్తారు. ఇలా తన తొలి చిత్రం “డ్రింకర్ సాయి”తో తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నారు యువ హీరో ధర్మ. గత డిసెంబర్ 27న థియేటర్స్ లోకి వచ్చిన “డ్రింకర్ సాయి” సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరించింది.
అయితే ఈ సినిమాలో హీరో ధర్మ తన డ్యాన్సులు, ఫైట్స్, యాక్టింగ్ తో అందరినీ మెప్పించాడు. సాయి పాత్రలో ధర్మ చేసిన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. టీజింగ్, ఫన్, ఎమోషనల్ సీన్స్ లో మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు ధర్మ. మరో ప్రామిసింగ్ యువ హీరో టాలీవుడ్ కు దొరికినట్లే అనే టాక్ “డ్రింకర్ సాయి” రిలీజ్ అయ్యాక ఇండస్ట్రీలో వినిపిస్తోంది. హీరో ధర్మ స్ట్రాంగ్ కెరీర్ కు “డ్రింకర్ సాయి” ఫస్ట్ స్టెప్ అయ్యింది. ఇక ముందు తాను ఎలాంటి సినిమాల్లో కనిపిస్తాడో చూడాలి.