ఈ ఏడాది డబ్బింగ్ సినిమాల హడావుడి బాగానే ఉంది !

ఈ ఏడాది డబ్బింగ్ సినిమాల హడావుడి బాగానే ఉంది !

Published on Mar 22, 2020 4:50 PM IST

మన తెలుగు ప్రేక్షకులు… బాగున్న పక్క భాష చిత్రాలను కూడా బాగా ఆదరిస్తారు. అందుకేనేమో తమిళ హీరోల్లో చాలామంది టాలీవుడ్ మార్కెట్ పై ఎప్పటికప్పుడు యుద్ధం చెయ్యటానికి డబ్బింగ్ చిత్రాలతో ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ప్రతి చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేరోజు విడుదల ప్లాన్ చేస్తారు. దాంతో తెలుగు స్టార్ హీరోల సినిమాలతో పాటు తమిళ్ స్టార్ హీరోల సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో తరచూ రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా తమిళ్ స్టార్ హీరోలు వరుస సినిమాలతో టాలీవుడ్ పై కలెక్షన్స్ కోసం దండయాత్ర చేయనున్నారు. ఇప్పటికే ‘దర్బార్’ సినిమాతో సూపర్ స్టార్ రజనీకాంత్ సంక్రాంతికి బాక్సాఫీస్ ఓపెన్ చేసేశాడు. పైగా శివ డైరెక్షన్లో చేస్తున్న కొత్త సినిమా ఈ దసరాకి రిలీజ్ చేస్తున్నాడు.

అలాగే మరో స్టార్ విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘మాస్టర్’ సినిమా కూడా రాబోతుంది. ఇక తెలుగులో పెద్దగా మార్కెట్ లేని తమిళ్ స్టార్ హీరో అజిత్ కూడా తన నూతన సినిమా ‘వాలిమై’ దీపావళి కానుకగా విడుదల చేస్తున్నాడు. ఇక హీరో సూర్య, మరో టాప్ హీరో విక్రమ్ భారీ బడ్జెట్ సినిమా ‘కొబ్రా’, కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో ధనుష్ చేస్తున్న ‘జగమే తంతిరమ్’, శింబు ‘మానాడు’ కూడా ఈ సంవత్సరంలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఏమైనా… తెలుగు స్టార్ హీరోల సినిమాలు కంటే కూడా.. తమిళ స్టార్ హీరోల సినిమాలే టాలీవుడ్ లో ఎక్కువుగా హడావుడి చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు