యంగ్ అండ్ టాలెంటెడ్ తేజ్ నటిస్తూ కన్నడ-తెలుగు భాషల్లో దర్శకత్వం వహిస్తున్న వినూత్న ద్విభాషా చిత్రం “డ్యూడ్”. ఫుట్ బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ ప్రేమికుడైన స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ఏమిటో మాయ మంత్రమే… మది జింకలా పరిగెత్తేనే” పాట అటు కన్నడలో.. ఇటు తెలుగులో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలుగులో ఎస్.పి.మనోహర్ రాసిన ఈ గీతాన్ని అభిషేక్ ఆలపించారు. ఎమిల్ మహమ్మద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రంగాయన రఘు ఫుట్ బాల్ కోచ్ గా ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 50 శాతం పూర్తయింది. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ లేదా జులైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ, భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
పనోరమిక్ స్టూడియోస్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ – అప్పాజీ, “జింకే మారి” ఫేమ్ ఎమిల్ మహమ్మద్ సంగీతం సమకూర్చుతుండగా… “అలా మొదలైంది” ఫేమ్ ప్రేమ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. నిర్మాణం: పనోరమిక్ స్టూడియోస్, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: తేజ్ లు అందిస్తున్నారు.