దుల్కర్ సల్మాన్ – భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న కొత్త చిత్రం కాంత. ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిన్న నిర్వహించింది. ప్రధాన జంట పై హీరో వెంకటేష్ మొదటి షాట్‌కు క్లాప్ కొట్టిన సంగతి తెలిసిందే. ఐతే, సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ బహుభాషా చిత్రం షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. 1950ల మద్రాసు నేపథ్యంలో సాగే ఈ కథ బరువైన భావోద్వేగాలతో సాగనుంది. పైగా నటుడు సముద్రఖని కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు.
కాగా, నిర్మాత స్వప్న దత్, రానా దగ్గుబాటి మరియు దుల్కర్ సల్మాన్ స్పిరిట్ మీడియా, స్వప్న సినిమా మరియు వేఫేరర్ ఫిలింస్‌పై భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహానటి, విరాట పర్వం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన డాని సాంచెజ్-లోపెజ్ ఈ చిత్రానికి కూడా సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. కాగా ఈ మేజర్ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది.