యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరదా’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేస్తుండగా ఫీల్ గుడ్ కాన్సెప్ట్‌తో ఈ మూవీని మేకర్స్ తెరకెక్కించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో మూవీపై మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి. కాగా, ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.
అయితే, ఈ సినిమాను మలయాళంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. దుల్కర్ సల్మాన్ తన సొంత బ్యానర్ అయిన వే ఫారర్ ఫిల్మ్స్ పై పరదా చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మలయాళ భాషలో రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ సినిమాకు మలయాళంలో కూడా మంచి క్రేజ్ దక్కడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఇక ఈ సినిమాలో దర్శన రాజేంద్రన్, సంగీత ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా మ్రిదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.