ఈ ఏడాది మన తెలుగు సినిమా నుంచి వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో దర్శకుడు వెంకీ అట్లూరి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ తో చేసిన మనీ థ్రిల్లర్ “లక్కీ భాస్కర్” కూడా ఒకటి. మరి అనుకున్న అంచనాలు రీచ్ అయ్యి అదరగొట్టిన ఈ చిత్రం దుల్కర్ కెరీర్ లో మరో హైయెస్ట్ గ్రాసర్ గా కూడా నిలిచింది. అయితే ఆడియెన్స్ కి ఆద్యంతం ఆనందం అందించిన ఈ చిత్రం ఇపుడు కొంప ముంచిందట.
ఈ చిత్రాన్ని చూసిన నలుగురు యువ విద్యార్థులు లక్కీ భాస్కర్ లానే ఏదోకటి చేసి ధనవంతులుగా మారి వస్తాం అని ఎక్కడికి వెళుతున్నారో చెప్పకుండా పారిపోయారట. ఇంట్రెస్టింగ్ గా వీరు నలుగురూ కేవలం తొమ్మిదో తరగతి మాత్రమే చదువుతున్నారట. దీనితో ఈ సినిమా చూసి ప్రభావితం అయ్యిన వీరు బయటకి వెళ్లిపోయారట.
మరి విశాఖపట్నంకి చెందిన చరణ్, తేజ, కిరణ్ కుమార్, రఘు అలాగే కార్తీక్ అనే నలుగురు టీనేజ్ కుర్రాళ్ళు లక్కీ భాస్కర్ రీసెంట్ గానే చూశారట. ఇది చూసి దుల్కర్ లానే సంపాదించే మళ్ళీ వెనక్కి వస్తాం అని స్నేహితులకి చెప్పి వెళ్లిపోయారట. దీనితో వీరు ఎక్కడికి వెళ్లారో కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయట. దీనితో ఇది ట్విస్ట్ గా మారింది.