మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో ఓ పీరియాడికల్ లవ్‌స్టోరీ చేస్తున్న సంగతి తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో, స్వప్న సినిమాస్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.7 గా, వైజయంతీ మూవీస్ సమర్పణలో ప్రియాంకా దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే నేడు దుల్కర్ బర్త్‌డే సందర్భంగా ‘లెఫ్టినెంట్ రామ్’గా ఆయనను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసింది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి లెఫ్టినెంట్ రామ్ ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అని రిలీజ్ చేసిన పోస్టర్ దుల్కర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇకపోతే త్వరలోనే ఈ సినిమాలో దుల్కర్ సరసన నటించబోయే హీరోయిన్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి