లక్కీ భాస్కర్ ట్రైలర్.. దుమ్ములేపిన దుల్కర్!

లక్కీ భాస్కర్ ట్రైలర్.. దుమ్ములేపిన దుల్కర్!

Published on Oct 21, 2024 6:52 PM IST

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’ ఇప్పటికే టాలీవుడ్‌లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీనికితోడు ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా కట్ చేశారు మేకర్స్. దుల్కర్ సల్మాన్ తనలోని నటుడిని ఈ సినిమాతో మరోసారి మనకు చూపించబోతున్నాడు. ఆయన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలవబోతుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అటు అందాల భామ మీనాక్షి చౌదరి కూడా తనదైన పర్ఫార్మెన్స్ ఇవ్వనుంది. ఇక వెంకీ అట్లూరి మరోసారి తన స్టోరీటెల్లింగ్‌తో ప్రేక్షకులకు ఓ చక్కటి ఎంటర్‌టైనర్‌ని అందించబోతున్నాడని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ ట్రైలర్‌లోని డైలాగులు ప్రేక్షకులను ఇన్‌స్టంట్‌గా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమకు జీ.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు మేకర్స్.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు