“లక్కీ భాస్కర్” విషయంలో ఛాలెంజింగ్ గా తీసుకున్న దుల్కర్


మోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తన లేటెస్ట్ సినిమానే “లక్కీ భాస్కర్”. తెలుగులో తాను చేసిన రెండో సినిమా ఇది కాగా చిత్రాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాని తెలుగు సహా తమిళ్, మళయాళ భాషల్లో కూడా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మరి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కి కూడా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.

కానీ తమిళ్ వెర్షన్ ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసినట్టుగా బాగా టాక్ వచ్చింది. దీనికి ప్రధాన కారణం డబ్బింగ్ దుల్కర్ సల్మాన్ వాయిస్ లో లేకపోవడం. దీనితో తన వాయిస్ ని సినిమాకి మిస్ అవుతున్నామని చాలా కామెంట్స్ వినిపించాయి. దీనితో దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న దుల్కర్ ఇప్పుడు టోటల్ సినిమాకి తమిళ్ లో తనే డబ్బింగ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనితో అన్ని భాషల్లో కూడా దుల్కర్ వాయిస్ లోనే లక్కీ భాస్కర్ రాబోతున్నాడని చెప్పొచ్చు.

Exit mobile version