ఓటిటిలో “డ్యూన్ 2” రిలీజ్ డేట్ ఫిక్స్..

ఓటిటిలో “డ్యూన్ 2” రిలీజ్ డేట్ ఫిక్స్..

Published on Jul 18, 2024 9:00 PM IST

ఇటీవల కాలంలో హాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన క్రేజీ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిన చిత్రాల్లో భారీ చిత్రం “డ్యూన్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం హాలీవుడ్ లో కొత్త ఒరవడిని తీసుకురాగా ఇటీవల ఈ చిత్రంకి సీక్వెల్ “డ్యూన్ 2” కూడా ఈ మధ్యనే వచ్చింది. అయితే పార్ట్ 1 కి వచ్చిన ఫేమ్ తో పార్ట్ 2 పై కూడా చాలా హైప్ జెనరేట్ అయ్యింది. కానీ ఆ అంచనాలు అందుకోవడంలో సినిమా మాత్రం పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

కానీ ఆ ఫ్లూక్ లో పార్ట్ ని చూద్దామనుకొని మిస్ అయ్యిన వారు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఫైనల్ గా వారికి అయితే గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పాలి. ఈ సినిమా ఇండియాలో ఇప్పుడు ప్రముఖ యాప్ జియో సినిమాలో అందుబాటులోకి రానుంది. ఇంగ్లీష్ సహా మొత్తం పాన్ ఇండియా భాషలు తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం హిందీ సహా మరాఠి, బెంగాలీ భాషల్లో రానుంది. అయితే ఈ చిత్రం ఈ ఆగస్ట్ 1 న రిలీజ్ కాబోతునట్టుగా ఫిక్స్ అయ్యింది. మరి అప్పుడు మిస్ అయ్యినవారు ఇప్పుడు చూడాలి అనుకుంటే ఈ ఆగస్ట్ 1 వరకు ఆగాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు