‘డన్కి’ లేటెస్ట్ కలెక్షన్ డీటెయిల్స్

‘డన్కి’ లేటెస్ట్ కలెక్షన్ డీటెయిల్స్

Published on Jan 9, 2024 3:00 AM IST

బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా తాప్సి పన్ను హీరోయిన్ గా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ, యాక్షన్ మూవీ డన్కి. ఈ మూవీని రాజ్ కుమార్ హిరానీ ఫిలిమ్స్, జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా గ్రాండ్ లెవెల్లో నిర్మించారు.

ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం బాగా కలెక్షన్ తో కొనసాగుతోంది. తాజాగా డన్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.444. 44 కోట్లని కొల్లగొట్టినట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. షారుక్ ఖాన్ అద్భుత యాక్టింగ్ తో పాటు రాజ్ కుమార్ హిరానీ సూపర్ టేకింగ్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మరి మొత్తంగా రాబోయే రోజుల్లో ఈ మూవీ ఇంకెంతమేర రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు