బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం డంకీ. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబడుతోంది. లాంగ్ రన్ లో మంచి హోల్డ్ ను కనబరుస్తోంది. ఈ చిత్రం 400 కోట్ల రూపాయల క్లబ్ లో తాజాగా చేరింది. మొత్తం 400.40 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది.
మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ, సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం గొప్ప విషయం అని చెప్పాలి. సినిమాకి మౌత్ టాక్ కీలకం అయ్యింది. అయితే షారుఖ్ ఖాన్ సినిమాలు ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద పఠాన్ , జవాన్ రూపం లో విధ్వంసం సృష్టించాయి. ఆ చిత్రాలకి ఈ డంకీ కాస్త దూరం అని చెప్పాలి. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.