“ఓజి” రిలీజ్ పై ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య లేటెస్ట్ స్టేట్మెంట్!

“ఓజి” రిలీజ్ పై ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య లేటెస్ట్ స్టేట్మెంట్!

Published on Apr 3, 2024 6:31 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PSPK) ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజి. ఈ చిత్రం కోసం ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ సినిమా కి సంబందించిన రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 27, 2024 న రిలీజ్ కానున్నట్లు తెలిపారు.

తాజాగా మరోసారి ఈ రిలీజ్ డేట్ పై ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కామెంట్స్ చేసారు. ఓజి త్వరలో మీ ముందుకు వస్తుంది. సెప్టెంబర్ 27 న ఓజి మీ ముందుకు వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు