మాస్ మహారాజా రవితేజ హీరోగా కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ ఈగిల్. ఈ మూవీలో రవితేజ పవర్ఫుల్ రోల్ చేస్తుండగా నెగటివ్ పాత్రలో వినయ్ రాయ్ నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీకి డవ్ జంద్ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవల రిలీజ్ అయిన మూడు సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకుని మంచి అంచనాలు ఏర్పరిచిన ఈగిల్ ఫిబ్రవరి 9న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, ఈగిల్ నుండి గరుడం అనే పల్లవి తో సాగె నాలుగవ సాంగ్ ని రేపు రాత్రి 8 గం. 1 ని. రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈగిల్ రిలీజ్ అనంతరం ఏస్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.