మాస్ యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో అదరగొట్టిన ‘ఈగిల్’ ట్రైలర్

మాస్ మహారాజా రవితేజ హీరోగా అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఈగిల్. ఈ మూవీ యొక్క టీజర్, ఫస్ట్ సాంగ్ ఇప్పటికే రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుని మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఇక నేడు కొద్దిసేపటి క్రితం ఈగిల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్.

ముఖ్యంగా ట్రైలర్ లో రవితేజ లుక్స్, డైలాగ్స్, మాస్ స్టైల్ తో పాటు యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక విజువల్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎంతో బాగుంది. మొత్తంగా ఈగిల్ ట్రైలర్ సినిమా పై ఇపటివరకు ఉన్న అంచనాలు అమాంతం పెంచేసింది అని చెప్పాలి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై వివేక్ కూచిబొట్ల, టిజి విశ్వప్రసాద్ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీ జనవరి 13న సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి రానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version