రాజమౌళి నెక్స్ట్ సినిమాపై ఇప్పటి నుండే పుకార్లు

రాజమౌళి నెక్స్ట్ సినిమాపై ఇప్పటి నుండే పుకార్లు

Published on Mar 20, 2020 1:55 PM IST

ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ పనుల్లో ఉన్నారు. వచ్చే యేడాది జనవరిలో ఈ చిత్రం విడుదలకానుంది. ఆ విడుదల తర్వాత కొన్ని రోజులు విరామం. అంటే జక్కన్న తర్వాతి చిత్రం ఏమిటనేది తేలాలంటే 2021 మార్చ్ అవుతుంది. కానీ ఇప్పటి నుండే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదేనంటూ రూమార్లు మొదలయ్యాయి. ఇక్కడ గమ్మత్తేమిటంటే పుకార్లు కూడా లాజికల్ గా ఉండటం.

ప్రతి పెద్ద సినిమా తర్వాత వెంటనే మరో భారీ చిత్రం కాకుండా మీడియమ్ బడ్జెట్లో చిత్రం చేయడం రాజమౌళి స్ట్రాటజీ. ఆ ప్రకారమే ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ఏదైనా మీడియమ్ స్థాయి సినిమా చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ అంటూ మరో పెద్ద సినిమాను స్టార్ట్ చేశారు రాజమౌళి. ఇలా వరుసగా పెద్ద సినిమాలే చేస్తున్నారు కాబట్టి తర్వాతది తప్పకుండా మీడియమ్ బడ్జెట్ సినిమానే అని బల్లగుద్ది చెబుతున్నారు.

అంతేనా ఆ సినిమాలో హీరో రామ్ అని కొందరంటే లేదు రానా అని కొందరు చెబుతున్నారు. ఇప్పటికే రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను కూడా రెడీ చేశారని అంటున్నారు. మరి పుకార్లు ఇప్పుడే ఇలా ఉంటే ‘ఆర్ఆర్ఆర్’ విడుదల సమయానికి ఇంకెంత స్థాయికి పెరిగిపోతాయో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు